యంగ్ హీరో నిఖిల్ పెళ్లంటూ కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. కానీ వాటిని ఈ యంగ్ హీరో ఖండించాడు. నిశ్చితార్ధం జరిగిపోయిందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదన్నాడు. పెళ్ళి ఆలోచన ఇప్పటికైతే లేదనీ, అయితే పెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటానని చెబుతున్న ఈ యంగ్ హీరో పెళ్ళి గురించిన రూమర్స్ కొంత ఇబ్బందికరంగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుస హిట్స్‌తో మంచి దూకుడు మీదున్న నిఖిల్, ఈ మధ్యనే ఫిట్నెస్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టాడు. కెరీర్లో ఫుల్‌గా సెటిలైనాక పెళ్లి చేసుకుంటానంటున్నాడు. డ్రీమ్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయనీ, వాటిని తీర్చుకున్నాకనే పెళ్లి తలంపు తెస్తాననీ అంటున్నాడు మన యంగ్ హీరో. అలాగే పెళ్లి చేసుకుంటే, ముందుగా మీడియాకి చెప్పే చేసుకుంటాననీ నవ్వేశాడు. 'కేశవ' సినిమాతో మంచి విజయం అందుకున్నాడు నిఖిల్. 'కార్తికేయ' సీక్వెల్ చేయాలని ఉందన్నాడు. త్వరలోనే ఆ సినిమాని పట్టాలెక్కించనున్నాడనీ అన్నాడు నిఖిల్. లేట్ అయినా కానీ లేటెస్టుగా వస్తానంటున్నాడు. కెరీర్ దూకుడు మీదున్న తరుణంలో తొందరపడి తప్పటడుగులు వేయకుండా, ఆచి తూచి అడుగులేస్తూ వచ్చిన సక్సెస్‌ని నిలబెట్టుకుందామనే యోచనలో ఉన్నాడు మనోడు. నిఖిల్ చాలా తెలివైనోడే. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి.