'కేశవ' చిన్న సినిమానే. కానీ ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు. ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి, సినిమా విడుదలయ్యేదాకా సినిమాకి జరిగిన ప్రమోషన్‌తో సినిమాపై ఆడియన్స్‌లో, సినీ పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్నంటే స్థాయికి పెరిగాయి. ఈ రోజే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉంది? అనే అంశం పక్కన పెడితే, సినిమాకి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చినట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో వచ్చిన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలా నిఖిల్ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. 'బాహుబలి' మేనియా ఇంకా భారతీయ సినీ పరిశ్రమలో తగ్గలేదు. ఈ టైమ్‌లో 'కేశవ' సినిమాని ధైర్యంగా తీసుకొచ్చారు. అందుకుగాను చిత్ర దర్శక నిర్మాతల గట్స్‌ని అభినందించి తీరాలి. సినిమాకి జరిగిన ప్రచారం, దాంతో ఆడియన్స్‌లో క్రియేట్ అయిన హైప్, ఇంట్రెస్ట్ ఇవన్నీ సినిమాకి తొలి రోజు మంచి వసూళ్ళను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం మంచి టాక్ వచ్చినా, 'కేశవ' సంచలనాలు సృష్టించడం ఖాయం. బాలీవుడ్ బ్యూటీ ఇషా కొప్పికర్ చాలాకాలం తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. 'కేవవ' సినిమాలో నిఖిల్ సరసన 'పెళ్ళిచూపులు' ఫేం రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. కాస్సేపట్లో సినిమా ఫలితం వెల్లడి కానుంది.