ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమకి చెందిన వ్యక్తులు నోరుజారడం అవి తీవ్రమైన అంశాలుగా పరిగణించడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇక తాజాగా బూత్ బంగ్లా దర్శకుడు అజయ్ కౌండిన్య తన చిత్ర ప్రమోషన్ లో మాట్లాడుతూ- సమాజంలోని కొందరు మహిళలపైన ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
దానికి సంబంధించి పలు టీవీ ఛానల్స్ లో కూడా చర్చలో పాల్గొన్న ఆ దర్శకుడు తన వ్యాఖ్యలని సమర్ధించుకోవడం విశేషం. ఈ తరుణంలో ఆయన పైన పలు మహిళా సంఘాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, దర్శకుడు అజయ్ కౌండిన్య పైన కేసు నమోదు చేయడం జరిగింది.
మరి ఈ పోలీస్ కేసుకి సంబంధించి దర్శకుడు ఇంకా స్పందిచాల్సిఉంది. ఇదే సమయంలో సినీ పరిశ్రమకి చెందిన వారు తాము మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడుకోవాలి అన్నఅభిప్రాయం వ్యక్తమవుతున్నది.