యంగ్ హీరో నిఖిల్ ఫ్యాన్స్ కి ఇది ఒకరకంగా చేదు వార్త అనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే, యంగ్ హీరో నిఖిల్ వివాహం రద్దయినట్టు తెలుస్తున్నది. ఈ విషయమై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇరు కుటుంబాల నుండి వెలువడనప్పటికి ఈ వివాహానికి బ్రేక్ పడినట్టుగా సమాచారం.
దీనికి కారణంగా ఇరువురి జాతకాల మధ్య సఖ్యత లేకపోవడమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకముందు తెలిపిన వివారాల ప్రకారం, తేజస్వి అనే అమ్మాయితో నిఖిల్ వివాహం అక్టోబర్ 1వ తేదిన జరగాల్సింది.
ఇక ఈ విషయమై హీరో నిఖిల్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.