మాస్కులు ఇక్కడ, శానిటైజర్స్‌ అక్కడ: ‘నిక్‌పాల్‌’!

By Inkmantra - May 14, 2020 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ధ ఓ ఇంటివాడయ్యాడు. ఈ రోజు ఉదయమే నిఖిల్‌ పెళ్ళి జరిగింది. వధువు డాక్టర్‌ పల్లవి వర్మ. ఈ పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వస్తున్నాయి. ‘పల్లవి అండ్‌ నిఖిల్‌’ అని వధూ వరుల పేర్లను రాసి వున్న ఓ బోర్డ్‌ మీద, ‘మాస్క్‌లు ఇక్కడున్నాయ్‌’, ‘శానిటైజర్స్‌ అక్కడున్నాయ్‌’ అంటూ గుర్తులు పెట్టారు. ‘ప్రేమ అన్ని చోట్లా వుంది’ అని ఇంకో గుర్తు కూడా పెట్టారు. కాన్సెప్ట్‌ అదిరింది కదూ.! మామూలుగా సెలబ్రిటీల పెళ్ళి.. అంటే ఓ రేంజ్‌లో హంగామా వుంటుంది.

 

కానీ, కరోనా వైరస్‌ భయాలున్నాయ్‌ కదా.. ఈ నేపథ్యంలో పెళ్ళిళ్ళు ఒకింత ఇన్నోవేటివ్‌గా, కొన్ని ఆంక్షల నడుమ సింపుల్‌గా జరగాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా హీరో నిఖిల్‌, పెద్దయెత్తున మాస్క్‌లు, శానిటైజర్లు తయారు చేయించి ఇచ్చాడు. సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకుని నిఖిల్‌ చేసిన ఈ కార్యక్రమాలకు బోల్డన్ని ప్రశంసలు దక్కాయి కూడా. మరి, అలాంటి నిఖిల్‌ తన పెళ్ళి విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటాడు.? ఇప్పటికైతే కొన్ని విశేషాలు బయటకొచ్చాయి. ఇంకా చాలా రాబోతున్నాయని అంటున్నారు నిఖిల్‌ సన్నిహితులు. ఏప్రిల్‌లోనే జరగాల్సిన ఈ వివాహం కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడి, ముందు ముందు ముహార్తాలు లేకపోవడంతో ఈ రోజు జరిగిన విషయం విదితమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS