యంగ్ హీరో నిఖిల్ తన కాబోయే భార్యను చాలా మిస్ అవుతున్నట్లున్నాడు. అన్నీ బాగుంటే, ఈ పాటికి నిఖిల్ తన లవర్ పల్లవి వర్మను వివాహం చేసుకుని, వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుండేవాడు. కానీ, మాయదారి కరోనా వీరి వైవాహిక బంధానికి అడ్డు కట్ట వేసింది. కరోనా తమ పెళ్లిని అడ్డుకోలేదనీ, గుడిలోనైనా వివాహం చేసుకుంటానంటూ ఒకానొక టైమ్‌లో నిఖిల్ బిల్డ్ అప్ ఇచ్చినా, కరోనాతో అంత ఆషామాషీ కాదని భావించి, పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అయితే, క్వారంటైన్‌లో ఉన్న నిఖిల్‌కి ప్రస్తుతం తన ఫియాన్సీ బాగా గుర్తొస్తున్నట్లుంది. తన ఫీలింగ్స్‌ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు.
ఆ క్రమంలో నిఖిల్ ఓ రొమాంటిక్ ఫోటోని పోస్ట్ చేశాడు. తన ఫియాన్సీ పల్లవి వర్మతో కలిసి బీచ్‌లో నిబడిన ఫోటో అది. నిఖిల్ విరహ భారాన్ని దించేలా అభిమానులు ఈ ఫోటోకి బోలెడన్ని లైకులూ, కామెంట్స్‌తో ముంచెత్తేశారు. ఇదిలా ఉంటే, ‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నిఖిల్, అదే జోష్‌లో రెండు సినిమాల్ని ఓకే చేసేశాడు. అందులో ఒకటి చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘కార్తికేయ’ సీక్వెల్ కాగా, మరొకటి ‘18 పేజెస్’ అనే సినిమా. ఈ రెండు సినిమాల్నీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన నిఖిల్, వివాహానంతరం రెగ్యులర్ షూటింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాడు.
వీలైనంత త్వరగా రెండు సినిమాల్నీ సమాంతరంగా పూర్తి చేయాలనుకున్నాడు. అయితే, లాక్‌డౌన్ కారణంగా నిఖిల్‌కి రెండు రకాలా దెబ్బ పడిపోయింది.