టీ.ఎన్.సంతోష్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న చిత్రం 'ముద్ర'. లేటెస్టుగా ఈ సినిమా టైటిల్ లోగోతో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. 'అర్జున్ లెనిన్ సురవరం' అనే రిపోర్టర్ పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడీ సినిమాలో. ఫస్ట్‌లుక్ వచ్చాక సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయ్. కాన్సెప్ట్ విషయానికి వస్తే, ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
ఓ క్రైమ్‌ని ఛేదించే దిశలో ఓ ప్రెస్ రిపోర్టర్ తన ఇంటెలిజెన్స్‌ని, విజన్‌ని ఎలా ఉపయోగించాడన్న నేపథ్యంలో ఆధ్యంతం ఆశక్తికరంగా ఈ సినిమాని తెరకెక్కించారట. అయితే కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్‌ని ఓ సారి బేరీజు వేసుకుంటుంటే, గతంలో జీవా హీరోగా వచ్చిన అనువాద చిత్రం 'రంగం' తెలుగులో మంచి విజయం అందుకుంది. ఆ సినిమాలో జీవా రిపోర్టర్ పాత్రనే పోషించాడు. అతి పెద్ద క్రైమ్‌ని ఛేదించాడు. సాధారణ ఓ రిపోర్టర్ అంత పెద్ద క్రైమ్‌ని ఎలా చేధించాడో అందరం చూశాం 'రంగం' సినిమా ద్వారా. అలాగే ఇప్పుడు నిఖిల్ 'ముద్ర' కూడా ఉండబోతుందేమో అనుకుంటున్నారు.
టైటిల్‌కి వస్తున్న రెస్పాన్స్ బాగుంది. ప్రీ లుక్‌లో 'పెన్ ఈజ్ మైటర్ దేన్ ది గన్' అనే క్యాప్షన్ కూడా ఆలోచింపచేసే విధంగా ఉంది. కత్తి పదును, తుపాకీ గుండు కన్నా కలం బలం ఎక్కువే అన్న సత్యం అందరికీ తెలిసిందే అయినా నిఖిల్ నటిస్తున్న 'ముద్ర' సినిమాలో ఆ బలం ఎంతగా చూపించారో అన్నదే ఆశక్తి గొలుపుతున్న అంశం. ఈ సినిమాలో నిఖిల్‌తో తొలిసారి ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది.