'ముద్ర'కు రెడీ అంటోన్న నిఖిల్‌.!

By iQlikMovies - August 10, 2018 - 19:15 PM IST

మరిన్ని వార్తలు

చాక్లెట్‌ బోయ్‌ ఇమేజ్‌ ఉన్న నిఖిల్‌ అప్పుడప్పుడూ విభిన్న పాత్రలను కూడా ట్రై చేసి, మాస్‌ హీరో అనిపించుకునేందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు. 'కేశవ' సినిమాలో ఫుల్‌ మాస్‌ అండ్‌ సీరియస్‌ రోల్‌ పోషించి హిట్‌ కొట్టాడు. 

ఇటీవల విడుదలైన 'కిర్రాక్‌ పార్టీ' సినిమాలో కాలేజ్‌ స్టూడెంట్‌గా క్లాస్‌, మాస్‌ రెండు షేడ్స్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించకపోయినా, సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ 'నిఖిల్‌ బాగా నటించాడే..' అనుకోకుండా ఉండలేకపోయారు. ఇప్పుడు 'ముద్ర' సినిమాతో రాబోతున్నాడు. టైటిల్‌తోనే ఏదో స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాడు నిఖిల్‌. 

ఇక సినిమాలో నిఖిల్‌ క్యారెక్టర్‌ కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్టు పాత్రలో నిఖిల్‌ కనిపించబోతున్నాడీ సినిమాలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. మన చాక్లెట్‌బోయ్‌ నిఖిల్‌కి ఈ సినిమా హిట్‌ ముద్ర వేస్తుందో లేదో చూడాలిక. ఇంతకీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేదెప్పుడంటే నవంబర్‌ 8. 

టీ.ఎన్‌.సంతోష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక డైరెక్టర్‌ విషయానికి వస్తే, టీఎన్‌ సంతోష్‌ అంటే విభిన్న చిత్రాల దర్శకుడే. మరి మన నిఖిల్‌తో ఈయన ఎలాంటి ప్రయోగం చేశాడో తెలియాలంటే నవంబర్‌ 8 వరకూ ఆగాల్సిందే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS