నితిన్-రాశి ఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడం జరిగింది. అయితే సినిమా విడుదలకి ముందు ఈ చిత్రం పైన అంచనాలు చాలానే ఉన్నా నిన్న ప్రేక్షకుల ముందుకి వచ్చాక మాత్రం అంచనాలు తిరగబడ్డాయి.
సినిమా మొత్తం ప్రేక్షకులకి ఒక “క్లాస్” లాగా మారిపోయింది అంటూ సెటైర్లు రావడంతో సినిమా కలెక్షన్స్ పైన తీవ్ర ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఇక తొలిరోజు కలెక్షన్స్ ఒకసారి చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, శ్రీనివాస కళ్యాణం బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు రూ 3 కోట్ల వరకు షేర్ రాగా రూ 5 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ కి హైప్ కి ఇంత తక్కువ స్థాయిలో వసూళ్ళు రావడం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్ర భవితవ్యం పై తీవ్ర ప్రాభావం చూపే అవకాశం కనిపిస్తున్నది.
మరి వారంతంలోపు ఎంత వసూలు చేస్తుంది ఈ చిత్రం అన్నది చూడాలి.