నిఖిల్‌ కొత్త సినిమాకి డిఫరెంట్‌ టైటిల్‌.!

By iQlikMovies - March 05, 2020 - 10:38 AM IST

మరిన్ని వార్తలు

అబ్బో యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ద్‌ స్పీడు మామూుగా లేదండోయ్‌. రీసెంట్‌గానే ‘కార్తికేయ 2’ సినిమాని లాంఛ్‌ చేశాడు. కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఇంకో కొత్త సినిమానీ అనౌన్స్‌ చేసేశాడు. టైటిల్‌తో సహా కొత్త సినిమా ప్రకటించాడు నిఖిల్‌. ‘18 పేజెస్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ని నిఖిల్‌ కొత్త సినిమాకి ఫిక్స్‌ చేశారు. మరి ఈ 18 పేజీల కథకు కథ అందించినదెవరో తెలుసా.? మన బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌. ఆయన కథ, స్క్రీన్‌ప్లేలో ఈ సినిమా రూపొందుతోంది. సూర్య ప్రతాప్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సుకుమార్‌ రైటింగ్స్‌లో సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన ‘కుమారి 21 ఎఫ్‌’ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే, నిఖిల్‌కి ‘18 పేజెస్‌’ కూడా మంచి విజయం అవుతుందని ఎక్సపెక్ట్ చేయొచ్చేమో.

 

ఇకపోతే, నిఖిల్‌ ఇటీవల ‘అర్జున్‌ సురవరం’ సినిమాతో సక్సెస్‌ కొట్టి, ఫుల్‌ జోష్‌తో పెళ్లి పీటలెక్కేందుకు రెడీగా ఉన్నాడు. వచ్చే నెల్లో నిఖిల్‌ తను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. అదే జోష్‌ని కెరీర్‌కి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. వరసపెట్టి సినిమాలు అనౌన్స్‌ చేస్తూ, ఆశ్చర్యపరుస్తున్నాడు. నిఖిల్‌ కెరీర్‌లో ఈ సక్సెస్‌ ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS