బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్‌పై నిన్న రాత్రి కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి, కొందరు స్నేహితులతో పబ్‌కి వెళ్లిన రాహుల్ సిప్లిగంజ్, ఈ దాడిలో తీవ్రంగా గాయ పడ్డారు. వివరాల్లోకి వెళితే, ఆ యువతి పట్ల కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తించడంతో, రాహుల్ వారిని నిలువరించే ప్రయత్నం చేశాడు. మాటా మాటా పెరగడంతో రాహుల్‌పై సదరు యువకులు బీరు సీసాలతో దాడి చేశారు. తలపై గట్టిగా మోదడంతో, తీవ్ర రక్తస్రావం అయ్యింది. దగ్గరలోని ఆసుపత్రిలో రాహుల్ చికిత్స పొందుతున్నారు.
అయితే, రాహుల్‌పై దాడి చేసిందెవరు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా, వికారాబాద్ ఎమ్మెల్యే కొడుకు సన్నిహితులున్నట్లు సమాచారం. అయితే తాజాగా రాహుల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. కానీ, ఈ ఘటనపై రాహుల్ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, పబ్‌లో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపోతే, సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్‌కి, బిగ్‌బాస్ విన్నర్‌గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.