నిఖిల్‌ మళ్లీ అదే తప్పు చేస్తాడా?

మరిన్ని వార్తలు

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అంటూ కొత్త కాన్సెప్ట్‌ చిత్రంతో ఫ్యాన్స్‌కి థ్రిల్‌ ఫీలింగ్‌ ఇవ్వడంతో పాటు డీమానిటైజేషన్‌ టైంలో వచ్చి సైలెంట్‌గా మంచి సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న చిన్నోడు నిఖిల్‌. ఇటీవల 'కిర్రాక్‌ పార్టీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'కేశవ' తదితర చిత్రాలతో మంచి హిట్స్‌ అందుకున్న నిఖిల్‌కి 'కిర్రాక్‌ పార్టీ' ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాలో నిఖిల్‌ రెండు డిఫరెంట్‌ వేరియేషన్స్‌ ఉన్న గెటప్స్‌లో కనిపించి మెప్పించాడు.

తర్వాత నిఖిల్‌, టి.ఎన్‌. సంతోష్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదీ ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీనే అని తెలుస్తోంది. తమిళంలో 'కణితన్‌' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్‌ టీఎన్‌. సంతోష్‌. కాగా తెలుగులో ఈయనకి ఇదే తొలి చిత్రం. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.' భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో గోల్డెన్‌ బ్యూటీ అనిపించుకున్నఈ ముద్దుగుమ్మకి ప్రస్తుతం చెప్పుకోదగ్గ సక్సెస్‌లు లేకపోయినప్పటికీ, వరుసపెట్టి ఆఫర్లు మాత్రం బాగానే వరిస్తున్నాయి.

ఇటీవల రామ్‌తో 'ఉన్నది ఒక్కటే జిందగీ', మెగా మేనల్లుడు తేజుతో 'ఇంటెలిజెంట్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన లావణ్య త్రిపాఠికి రెండూ నిరాశే మిగిల్చాయి. అయినా కానీ ఆఫర్లు మాత్రం విడిచి పెట్టడం లేదు. తాజా ఆఫర్‌ నిఖిల్‌ సినిమాతో పాటు, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో 'వ్యోమగామి' చిత్రంలో నటిస్తోంది లావణ్య త్రిపాఠి. చూడాలిక వీటితోనైనా లావణ్య బంపర్‌ హిట్స్‌ అందుకుంటుందో? లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS