శ్రీకాంత్‌ అడ్డాల మినీ మల్టీస్టారర్‌

మరిన్ని వార్తలు

ఇద్దరూ యంగ్‌ హీరోలే. ఇద్దరూ సక్సెస్‌ల మీదే ఉన్నారు. ఆ ఇద్దరితోనూ సినిమా తీస్తే, ఇటే చూసే ఆడియన్స్‌కీ పండగే, తీసే దర్శక నిర్మాతలకీ పండగే. అందుకే విభిన్న కథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ నిర్ణయానికి వచ్చాడు. 'కొత్త బంగారు లోకం' సినిమాతో కొత్త నటీనటులతో హిట్‌ కొట్టి, ఏకంగా కుంభస్థలాన్ని కొట్టేశాడు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' మల్టీ స్టారర్‌తో. ఆ తర్వాత మెగా ప్రిన్స్‌ని తెలుగు తెరకు పరిచయం చేశాడు 'ముకుందా' సినిమాతో.

ఈ సినిమాతోనూ శ్రీకాంత్‌ అడ్డాల మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన 'బ్రహ్మూెత్సవం'తో భారీగా నష్టపోయాడు. డిజాస్టర్‌ని చవి చూశాడు. ఇప్పుడు యంగ్‌ హీరో శర్వానంద్‌ మరో యంగ్‌ హీరో శ్రీ విష్ణులతో ఓ మినీ మల్టీ స్టారర్‌కి ప్లాన్‌ చేశాడు. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట శ్రీకాంత్‌ అడ్డాల. అలాగే మనసుకు హత్తుకునే భావోద్వేగాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడట. శర్వానంద్‌, శ్రీవిష్ణు అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.

ఇద్దరికీ ఈక్వెల్‌ ఇంపార్టెన్స్‌ ఉండేలా పాత్రల్ని డిజైన్‌ చేశాడట. శ్రీవిష్ణు ఇటీవల 'నీదా నాదీ ఒకే కథ' అంటూ సోలో హీరోగా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా, సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లోనూ తనదైన ముద్ర వేస్తాడు శ్రీవిష్ణు. ఇక శర్వా గురించి చెప్పేందుకేముంది. పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా ఫెస్టివల్‌ హీరో అనే ట్యాగ్‌ లైన్‌ వేయించుకున్నాడు. ఈ ఇద్దరు సక్సెస్‌ హీరోలతో శ్రీకాంత్‌ అడ్డాల ఈ సారి సక్సెస్‌ అందుకుంటాడేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS