త్వరలో కార్తికేయ 3

మరిన్ని వార్తలు

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 2 ' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ నిఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  2014 లో వచ్చిన కార్తికేయ మూవీకి సీక్వెల్ గా కార్తికేయ 2  వచ్చింది. ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ని బాగా మెప్పించింది. ఈ సిరీస్ కి చందు మొండేటి దర్శకత్వం వహించారు.   కార్తికేయ 2 వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇప్పుడు కార్తికేయ 2 సీక్వెల్‌ గురించి నిఖిల్ అప్డేట్ ఇచ్చారు. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని హీరో నిఖిల్‌ పోస్ట్‌ పెట్టారు. 


ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ సిద్దార్థ్, చందు మొండేటి కాంబినేషన్‌లో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని చూసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అయితే ఈ మూవీ గూర్చి పూర్తి అప్డేట్స్ త్వరలో రానున్నట్లు సమాచారం. ప్రజంట్ స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతున్నట్లు టాక్. మొదటి రెండు పార్ట్స్ లా ఈ మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని మీ అందరి అంచనాలని అందుకునేలా ఈ మూవి ప్లాన్  చేస్తున్నామని కూడా వెల్లడించారు.


కార్తికేయ 2 లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అనుపమ్  ఖేర్ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు సీక్వెల్ లో పాత నటీ నటులే ఉంటారా, లేదా కొత్తవారు యాడ్ అవుతారో చూడాలి. ఈ మధ్యే తండ్రి అయిన నిఖిల్ స్వయంభు చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు చందు మొండేటి కూడా నాగ చైతన్య తో 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. దీని తరవాత నిఖిల్, చందు ల కార్తికేయ 3 స్టార్ట్ అవుతుందని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS