స్పై మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: స్పై
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, ఆర్యన్ రాజేష్,  ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమఠం
దర్శకత్వం: గ్యారీ బిహెచ్
 

నిర్మాత: కె. రాజశేఖర్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
కూర్పు: గ్యారీ బిహెచ్
 

బ్యానర్స్: ఈడీ  ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 29 జూన్ 2023


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2/5
 

కార్తికేయ 2 పాన్ ఇండియా విజయం తర్వాత మరోసారి పాన్ ఇండియా టార్గెట్ గా ‘స్పై’ తో వచ్చాడు నిఖిల్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ సీక్రెట్ ఇందులో చూస్తారని ప్రచారం చేయ‌డంతో అందరి ద్రుష్టి పడింది. దేశానికి సంబధించిన టాప్ సీక్రెట్ కథ అంటూ ప్రమోషన్స్ లో ఊరించారు. మరి ప్రచారం చేసినట్లు నేతాజీ డెత్ మిస్టరీ ఇందులో వీడిందా? అసలు ఈ స్పై మిషన్ ఏమిటి ? 


కథ: ఖాద‌ర్ ఖాన్ (నితిన్ మెహ‌తా) అనే ఉగ్రవాది భార‌త‌దేశంపై న్యూ క్లియ‌ర్ ఎటాక్ ప్లాన్ చేస్తాడు. దాన్ని ఆప‌డానికి ‘రా’ త‌న ఏజెంట్లంద‌రినీ రంగంలోకి దించుతుంది. ఆ ఏజెంట్లలో జై (నిఖిల్‌) ఒక‌డు. జై కి ఒక ఫ్లాష్ బ్యాక్ వుంటుంది. జై అన్నయ్య  సుభాష్‌( రాజేష్ ) ఓ మిషన్ లో ప్రాణాలు కోల్పోతాడు. అన్నయ్య మ‌ర‌ణం వెనుక ఉన్న ర‌హ‌స్యం తెలుసుకోవాల‌ని ఒక‌వైపు, ఖాద‌ర్‌ని ప‌ట్టుకోవాల‌న్న మిష‌న్ మ‌రోవైపు... ఈ రెండిటితో సతమతమౌతున్న జైకి మరో మిషన్ ఎదురౌతుంది. నేతాజీకి సంబధించిన రహస్య పత్రాలు.. ఖాదర్ చేతికి చిక్కుతాయి. వాటిని కూడా వెనక్కి తెచ్చే భాద్యత జై పై పడుతుంది. మరి ఈ ప్రయాణంలో అతనికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయనేది మిగతా కథ.
 

విశ్లేషణ: కొన్ని సార్లు ఓవర్ ప్రమోషన్స్ కూడా మంచిది కాదు. నేతాజీ జీవితం, మరణ రహస్యం అంటూ ప్రచారం చేసుకుంది ఈ సినిమా యూనిట్. థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి కొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే  ఆ అంచనాలని మాత్రం ఏ దశ‌లోనూ అందుకోలేక‌పోయింది స్పై. ఎక్కడో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక వాయిస్ ఓవర్ కోసం నేతాజీ పేరుని వాడుకున్నారు తప్పితే ఇందులో నేతాజీకి సంబధించిన ఏ కొత్త అంశం లేదు. 


ఇప్పుడు సినిమా గురించి చెప్పుకుంటే.,ఇదో స్పై థ్రిల్లర్. కానీదిని ట్రీట్ మెంట్, టేకింగ్ ఎక్కడా ఉత్కంఠ రేకెత్తించదు. ఈ కథకి ఈ హీరో పాత్రకి సింక్ కుదరలేదు. ఒక ఇంటర్నేషనల్ సెటప్ తో కథని మొదలుపెట్టి.. ఆ కథని ముగ్గురి ప్రైవేట్ వ్యవహారంలా నడిపే తీరు ఏమాత్రం ఆకట్టుకోదు. హీరోయిన్ ని పాత్రని ప్రవేశపెట్టిన తీరు, ఆ పాత్రతో హీరో జర్నీ లాజిక్ లెస్ గా వుంటుంది. ఇలాంటి కథలు తీసినప్పుడు రా ప్రోటోకాల్ గురించి కొంచెం తెలుసుకుంటే మంచింది. కానీ దర్శకుడు అలాంటి కసరత్తు ఏమీ చేసినట్లు కనిపించదు. ఇంటర్వెల్ కి ముందు గానీ ఈ సినిమా అసలు పాయింట్ మొదలుకాదు. అక్కడి వరకూ చాలా ఫ్లాట్ టేకింగ్ తో అలా ఎదో సాగుతూవుతుంది. 


సెకెండ్ హాఫ్ తర్వాత అయినా నేతాజీ కథలోకి వెళ్తారని ఆశిస్తే మన పొరపాటే. నిజానికి ఆ కథలో వెళ్ళాడాని దర్శకుడి దగ్గర కూడా ఏం సమాచారం లేదు. ఎక్కడో చదివిన ఆర్టికల్ తో స్ఫూర్తి పొంది .. నేతాజీ రహస్యాలు అంటూ ప్రచారంలో ఊదరగొట్టారు కానీ ఇందులో చూపించిన రహస్యాలు ఏమీ లేవు. పైగా పార్ట్ 2 కి రహస్యాన్ని దాచుతున్నాం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చి సీక్వెల్ హింట్ ఇచ్చారు.  ఆ ముగింపు చూసిన ప్రేక్షకుడు.. ‘ఇప్పటివరకూ చూసిందే ఎక్కువ’ అనే ఎక్స్ ప్రెషన్ తో బయటికి వస్తాడు 


నటీనటులు : ఈ పాత్ర నిఖిల్ ఇమేజ్ కి మ్యాచ్ కాలేదు. ఓ ఆపద నుంచి దేశాన్ని కాపాడే రా ఏజెంట్ గా చూపించాలంటే పాత్రని బలంగా మలచాలి. ఇందులో ఆ బలం లేదు. దీంతో అదంతా వృధా ప్రయాస అయ్యింది. యాక్షన్ సీన్స్ కోసం కష్టపడ్డాడు. హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య తనకంటే సినియర్ గా పరిచయమై.. మిషన్ కి వచ్చేసరికి జూనియర్ గా మారిపోతుంది వింతగా. వాళ్ళ కెమిస్ట్రీ కూడా కుదరలేదు. అభినవ్ గోమతం రా ఏజెంట్ గా చేసే కామెడీ ఈ కథకి సింక్ కాలేదు. నితిన్ మెహత, జీషు సేన్ గుప్తా పాత్రలు ఓకే అనిపిస్తాయి. మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. అన్నట్టు రానా ఇందులో గెస్ట్ రోల్ లో కనిపించారు. 


టెక్నికల్ : సినిమా టెక్నికల్ గా అంత గొప్పగా లేదు. సీజీ వర్క్ తేలిపోయింది. నేపధ్య సంగీతం సీన్ కి సంబంధం లేకుండా వుంది. కెమరాపనితనం డీసెంట్ గావుంది. నిర్మాణ విలువలు ఓకే అనిపిస్తాయి. మాటల్లో మెరపులు లేవు. దర్శకుడు గార్యీ బిహెచ్ అనుభలేమి కనిపించింది. దాదాపు సీన్స్ లో ఎమోషన్స్ మిస్ అయ్యాయి.  ఒక కథ చెబుతానని మొదలుపెట్టి  అసలు కథ కాకుండా ఏవేవో చెప్పి ఎటేటో తీసుకేల్లిపోయారు. 

 

ప్లస్ పాయింట్స్ 

యాక్షన్ సీన్స్ 
నేపధ్య సంగీతం 


మైనస్ పాయింట్స్ 

కథ కథనం 
ఎమోషన్స్ లేకపోవడం 
లాజిక్స్ మిస్సింగ్


ఫైనల్ వర్దిక్ట్ : స్పై .. మిషన్ మిస్ ఫైర్..


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS