దేవరకొండకు కాస్త అండగా ఉండరూ.!

మరిన్ని వార్తలు

'గీత గోవిందం' సినిమాతో కలెక్షన్స్‌ పరంగా టాప్‌ లెవల్‌కి చేరిపోయిన యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండను పట్టుకోవడం ఎవ్వరి తరం కాకపోయింది. అయితే అనూహ్యంగా 'నోటా' రివర్స్‌ రిజల్ట్‌ ఇవ్వడంతో పాపం బెల్లంకొండ కొండ దిగి నేలకొచ్చేశాడు. 

ఓ పక్క 'నోటా' బెడిసికొట్టడం, మరోపక్క 'టాక్సీవాలా' పైరసీ వీడియో లీకేజీ వ్యవహారం ఇలా దెబ్బ మీద దెబ్బ పడడంతో విజయ్‌ దేవరకొండ బాగా డీలా పడిపోయాడు. 'టాక్సీవాలా' సినిమా చేయడానికి ఎంతో కష్టపడ్డామనీ, అలాంటిది ఆ సినిమా విషయంలో చాలా చాలా అన్యాయం జరిగిందనీ బాధపడ్డాడు. ఎట్టకేలకు ఇండస్ట్రీలో బడా హీరోల మద్దతు కోసం వారి చేతులు పట్టుకోక తప్పలేదు. అలా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అల్లు అర్జున్‌ని తీసుకొచ్చాడు. 

అలాగే సోషల్‌ మీడియా వేదికగా పలువురు హీరోలు విజయ్‌ దేవరకొండ 'టాక్సీవాలా'కు మద్దతుగా నిలుస్తున్నారు. పైరసీని అరికట్టేందుకు ఇండస్ట్రీ మొత్తం ఏకం కావాలి. ఇదేదో విజయ్‌దేవరకొండ ఒక్కడి కష్టమే కాదు, అందరి కష్టంగా భావించాలి. ఇప్పుడు విజయ్‌కి జరిగిన నష్టమే రేపు మనలో ఏ ఒక్కరికైనా జరగొచ్చు.. లీక్‌ అయినా 'టాక్సీవాలా' సినిమాని విజయవంతం చేయాలని అభిమానుల్ని కోరుతూ, యంగ్‌ హీరో నిఖిల్‌ తన వంతు సపోర్ట్‌ అందించాడు 'టాక్సీవాలా' సినిమాకి. 

షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాపులర్‌ అయిన రాహుల్‌ సాంకృత్యన్‌ అనే యంగ్‌ డైరెక్టర్‌ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ శనివారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS