RX100 హిందీ రీమేక్ లో హీరో ఫిక్సయ్యాడు

మరిన్ని వార్తలు

గత ఏడాది తెలుగులో విడుదలైన RX 100 సినిమా చిన్న సినిమాలలో పెద్ద సంచలనంగా మారింది. కథలోని వైవిధ్యం, నటీనటుల అభినయం, దర్శకుడి ప్రతిభ ఇలా అనేక అంశాలు కలగలిసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కొట్టింది.

ఇక ఈ చిత్ర కథకి సంబంధించిన యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో అన్ని ప్రధాన బాషల్లోకి అనువదించే ఆస్కారం ఉండింది. అందులో భాగంగానే హిందీలో ఈ చిత్ర రీమేక్ కి సంబంధించిన వివరాలు బయటికొచ్చాయి. ఈ సినిమాని హిందీలో ప్రముఖ దర్శకుడు మిలన్ లూత్రియా దర్శకత్వం వహిస్తుండగా హీరో సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కానున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉండడంతో రీమేక్ లో ఒక మంచి నటి కోసం అన్వేషణ కొనసాగుతున్నది. త్వరలోనే ఈ పాత్ర కోసం నటి ఎంపిక పూర్తవుతుంది అని సమాచారం.

ఏదేమైనా... ఈ సినిమా హిందీలో కచ్చితంగా హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS