మైక్‌ పట్టుకున్న నిఖిల్‌

మరిన్ని వార్తలు

నిఖిల్‌ ఏంటీ? మైక్‌ పట్టుకోవడమేంటీ అనుకుంటున్నారా? అవునండీ నిజమే. తాను నటించబోయే తాజా చిత్రంలో జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు నిఖిల్‌. ఈ సినిమాలో నిఖిల్‌ పాత్ర పేరు 'అర్జున్‌ సురవరం'. ఓ పవర్‌ఫుల్‌ జర్నలిస్టుగా నిఖిల్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రీ లుక్‌ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 

'పెన్‌ ఈజ్‌ మైటర్‌ దేన్‌ ది గన్‌' అనే సందేశమిస్తూ, ఆ పక్కనే నిఖిల్‌ ఐడీ కార్డ్‌, కెమెరా ఉన్నాయి ఈ ప్రీ లుక్‌లో. ప్రీ లుక్‌ని బట్టి నిఖిల్‌ జర్నలిస్టుగా నటిస్తున్నాడనీ అర్ధమైపోయింది. ఇక ఫస్ట్‌లుక్‌ని జూన్‌ 1న అనగా రేపు విడుదల చేయనున్నారు. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రమట. టీ.ఎన్‌. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే నిఖిల్‌ 'కిర్రాక్‌ పార్టీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి, యూత్‌కి కిర్రాక్‌ పుట్టించాడు. అయితే ఈ సినిమా ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు నిఖిల్‌కి. 

ఇప్పుడు రాబోయే చిత్రంతో ఖచ్చితంగా మెప్పిస్తానంటున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌. మాంచి ఎనర్జీ ఉన్న హీరో నిఖిల్‌. తన ఎనర్జీకి తగిన కథలతో పాటు, అప్పుడప్పుడూ 'కేశవ' వంటి విభిన్న కథా చిత్రాలను కూడా ఎంచుకుంటూ, సక్సెస్‌ అందుకుంటున్నాడు. తాజా చిత్రం టైటిల్‌ వివరాలు ఇంకా తెలీదు కానీ, ప్రీ లుక్‌ అంచనాల్ని పెంచుతోంది. ఫస్ట్‌లుక్‌ వస్తే ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యే అవకాశాలు లేకపోలేవు. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS