గ్లామ్‌షాట్‌: ఇస్టైల్‌ చితక్కొటేసింది

By Inkmantra - October 12, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

'చీకట్లో చితక్కొట్టుడు' సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ నిక్కీ తంబోలీ. హారర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో దెయ్యం పాత్రలోనూ బోలెడంత గ్లామర్‌ పండించేసిందీ బ్యూటీ. అలా హాట్‌ దెయ్యంగా సంచలనమైంది. ఆ సినిమాలో పాప పర్‌ఫామెన్స్‌ మెచ్చి రాఘవ లారెన్స్‌ తన 'కాంచన 3' సినిమాలో ఛాన్సిచ్చాడు. ఆ సినిమాతోనూ హిట్‌ కొట్టింది కదా.. తాజాగా ముచ్చటగా మూడో ఆఫర్‌ కూడా దక్కించుకుంది. ఈ సారి సోలో హీరోయిన్‌గా.

 

విలక్షణ నటుడు శ్రీ విష్ణు తాజా చిత్రం 'తిప్పరా మీసం'లో నిక్కీ తంబోలీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓ మోస్తరు అవకాశాలతో కెరీర్‌ని మెల్ల మెల్లగా బాగానే బిల్డప్‌ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తదుపరి అవకాశం కోసం తనదైన శైలిలో ఎరలు వేస్తోంది. ఆ ఎర ఏంటనుకుంటున్నారా.? ఇదిగో ఈ గ్లామర్‌ వల. వైట్‌ కలర్‌ స్వెట్టర్‌లాంటి టాప్‌ ధరించింది. ఈ ఆఫ్‌ షోల్డర్‌ టాప్‌లో నేలపై కూర్చొని ఎలా వయ్యారాలు పోతోందో చూశారుగా. పిక్‌లో నిక్కీ స్టైల్‌ నచ్చితే, మీరూ ఓ లుక్కేస్కోండి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS