డాన్సులు ఇరగదీసేసిన చైతూ.!

By iQlikMovies - October 29, 2018 - 15:03 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని బుల్లోడు నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'సవ్యసాచి'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుండగా, వెరీ లేటెస్టుగా విడుదలైన 'నిన్ను రోడు మీద చూసినట్టు లగాయతు..' ప్రోమో సాంగ్‌కి వస్తున్న రెస్పాన్స్‌ సినిమాపై అంచనాల్ని మరింత రెట్టింపు చేసింది. 

ఈ సాంగ్‌లో చైతూ డాన్సుల గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. డాన్సుల విషయంలో చైతూ కాస్త వీక్‌ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్‌ కోసం చైతూ చాలా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపిస్తోంది. స్పీడ్‌ లెగ్‌ మూమెంట్స్‌ అదరగొట్టేశాడు చైతూ. ఇక ఈ సాంగ్‌లో చైతూతో ఆడి పాడిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ ఏఅనిపిస్తోంది. 

ఇదే ఈ ముద్దుగుమ్మకు తొలి సినిమా. అయినా డాన్సులు, అప్పియరెన్స్‌తో పిచ్చెక్కించేస్తోందంతే. సాంగ్‌లో నిధి అగర్వాల్‌ ఎంట్రీ అద్ధిరిపోయింది. అలాగే అమ్మడి డాన్స్‌ టాలెంట్‌కి శాంతం కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారప్పుడే. నాగార్జున నటించిన 'అల్లరి అల్లుడు' చిత్రంలోనిదీ సాంగ్‌. ఈ సాంగ్‌ని చైతూ 'సవ్యసాచి' కోసం రీమిక్స్‌ చేశారు. 

అయితే ఎందుకో కానీ, యూట్యూబ్‌లో విడుదలైన కాస్సేప్పటికే ఈ సాంగ్‌ వీడియోని తొలిగించేశారు. ఇకపోతే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీగా తెరకెక్కుతోన్న 'సవ్యసాచి' నవంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ హీరో మాధవన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS