సినిమాలో కంటెంట్‌కీ, చేస్తున్న ప్రమోషన్‌కీ అస్సలు పొంతన లేదు. ఏ సినిమా అంటారా.? యంగ్ హీరో సందీప్‌కిషన్ నటిస్తున్న 'నిను వీడని నీడను నేనే'. ఇదో హారర్ మూవీ వాస్తవానికి. హారర్ అంటే హారర్ కూడా కాదు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ కాన్సెప్ట్ మూవీ. అయితే, సినిమా ప్రమోషన్ అంతా సూపర్ హాట్‌గా చేస్తున్నాడీ యంగ్ హీరో. హీరోయిన్ ఆన్యా సింగ్‌తో ఘాటు రొమాంటిక్ స్టిల్స్ పోస్టర్స్‌గా రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్‌లో హీట్ పెంచుతున్నాడు.
సినిమా కాన్సెప్ట్ కూడా జనంలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అయితే, ఇదే రోజు విడుదలవుతున్న మరో రెండు సినిమాలు లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లు కావడంతో, తాను కూడా ఆ ప్రొజెక్షన్ కూసింతైనా క్రియేట్ చేయాలనుకుంటున్నాడు కాబోలు. పోస్టర్స్‌తో తెగ వేడి పుట్టించేస్తున్నాడు. అంతేకాదు, తనకు పోటీగా వస్తున్న ఇద్దరు హీరోలూ డెబ్యూ హీరోలే కావడం విశేషం.
'దొరసాని'తో ఆనంద్ దేవరకొండ, 'రాజ్‌ధూత్'తో మేఘాంష్ శ్రీహరి హీరోలుగా పరిచయమవుతున్నారు. ఈ ఇద్దరు డెబ్యూ హీరోలనూ తట్టుకుని సందీప్ నెగ్గుకొస్తాడా.? ఆడియన్స్ కొత్త హీరోలను ఎంకరేజ్ చేస్తారా.? లేక సందీప్ కిషన్ న్యూ అటెంప్ట్‌ని ఎంకరేజ్ చేసి సూపర్ హిట్ కట్టబెడతారా.? అనేది తెలియాలంటే కొద్ది గంటలు మాత్రమే వేచి చూడాలిక. రేపు అనగా ఈ నెల 12న 'నిను వీడని నీడ'తో సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.