'శంకర్‌'కి పోటీగా 'మిస్టర్‌ కేకే'

By iQlikMovies - July 11, 2019 - 14:00 PM IST

మరిన్ని వార్తలు

'మిస్టర్‌ కేకే'.. ఇది ఏ హీరో సినిమా అని అనుకోకండి. విలక్షణ నటుడు విక్రమ్‌ నటిస్తున్న తాజా సినిమానే మిస్టర్‌ కేకే. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పుడు విక్రమ్‌ సినిమాలంటే, డబ్బింగ్‌ మూవీ అయినా అంచనాలు భారీగా ఉండేవి. 'అపరిచితుడు' తదితర చిత్రాలు ఆ రేంజ్‌లో నిర్మాతలకు కాసుల పంట పండించాయి అప్పట్లో. కానీ, ఈ మధ్య విక్రమ్‌కి ఏ సినిమా కలిసి రావడం లేదు. కానీ 'మిస్టర్‌ కేకే'ని టెక్నికల్‌గా చాలా రిచ్‌ వేల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్‌ మేకింగ్‌ స్టైల్లో ఈ సినిమా మేకింగ్‌ ఉండడం విశేషం.

 

విక్రమ్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే, మార్కెట్‌ ఎలా ఉంది అనేది మాత్రం రిలీజయ్యాక, రిజల్ట్‌ని బట్టి చెప్పలేం. అయితే, విక్రమ్‌ ఈ సినిమాని మార్కెట్‌ చేయడంలో కాస్తంత ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపించాలి. ప్రమోషన్స్‌ వేడి పెంచాలి. ఎందుకంటే ఇదే రోజు భారీ అంచనాలతో పూరీ సినిమా 'ఇస్మార్ట్‌ శంకర్‌' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై మాస్‌ ఆడియన్స్‌ బాగా దృష్టి పెట్టారు.

 

అదీ కాక, సినిమా ప్రమోషన్స్‌ ఓ రేంజ్‌లో చేస్తున్నారు. బీ,సీ సెంటర్స్‌లో ఇప్పటికే బాగా ఎక్కేసింది ఈ సినిమా. లోకల్‌ కంటెంట్‌ కావడంతో నైజాంలో బాగా అంచనాలున్నాయి. ఇలాంటి తరుణంలో విక్రమ్‌ 'మిస్టర్‌ కేకే'ని ఇక్కడ పట్టించుకుంటారా.? అంటే నటుడిగా విక్రమ్‌ని ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. ఆయన నటించిన 'ఐ' సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నా, కొద్దో గొప్పో ఆ సినిమా విషయంలో విక్రమ్‌పై సానుభూతి చూపించిన వారూ లేకపోలేదు. అలా లక్కు కలిసొస్తే, 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో పాటు, విక్రమ్‌ 'మిస్టర్‌ కేకే'కీ ఓ మోస్తరు ఓపెనింగ్స్‌ రాకుండా ఉండవ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS