లైన్ క్లియ‌ర్ చేసుకున్న నిశ్శ‌బ్దం

By iQlikMovies - May 27, 2020 - 11:29 AM IST

మరిన్ని వార్తలు

ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా నిశ్శ‌బ్దం. లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయింది. ఈసారి ఎప్పుడు థియేట‌ర్లు తెర‌చినా... తెర మీద బొమ్మ ప‌డిపోవ‌డానికి `నిశ్శ‌బ్దం`గా సిద్ధ‌మైపోయింది ఈ చిత్రం. అనుష్క క‌థానాయిక‌గా న‌టించింది. మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌ధారి. తెలుగుతో పాటు మిగిలిన భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. నిన్న.. అంటే మంగ‌ళ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలూ పూర్త‌య్యాయి. సెన్సార్ బృందం ఈ చిత్రానికి యూ బై ఏ స‌ర్టిఫికెట్ మంజూరు చేసింది.

 

ఇక‌.. ఈ సినిమా విడుద‌ల‌కుల ఎలాంటి ఢోకా లేన‌ట్టే. నిశ్శ‌బ్దం చేతిలో ఓ టీ టీ ఆఫ‌ర్లు చాలా ఉన్నాయి. థియేట‌ర్లు ఆల‌స్య‌మైన ప‌క్షంలో ఈ సినిమాని ఓ టీ టీకి అమ్మాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫిక్స‌య్యారు. అయితే ఓ టీ టీకి అమ్మాల‌న్నా ఈ సినిమాకి సెన్సార్ జ‌ర‌గాల్సివుంది. నిన్న‌టి వ‌ర‌కూ సెన్సార్ జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి, ఈ సినిమా ఓ టీ టీకీ వెళ్ల‌లేక‌పోయింది. ఇప్పుడు ఆ అడ్డూ తొల‌గిపోయిన‌ట్టు అయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS