ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- ఛల్ మోహన్ రంగ

By iQlikMovies - April 08, 2018 - 15:31 PM IST

మరిన్ని వార్తలు

ఈవారం విడుదలైన నితిన్ 25వ చిత్రం ఛల్ మోహన్ రంగకి బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం అనే ఒక పెద్ద అద్దంకి ఎదురైంది. ఇప్పటికే రంగస్థలం పెద్ద హిట్ అవ్వడం భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తుండడం ఈ చిత్రానికి ఇబ్బందిగా మారింది.

ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే, పెద్ద ఆసక్తికరమైన కథ ఏమి కాకపోయినప్పటికీ, హాస్య సన్నివేశాలతో దర్శకుడు నెట్టుకొచ్చాడు అని చెప్పాలి. రొటీన్ కథకి రచయత-దర్శకుడు అయిన కృష్ణచైతన్య రాసిన సన్నివేశాలు, ముఖ్యంగా హాస్యానికి ఈ సినిమాలో పెద్ద పీట వేయడం జరిగింది.

నితిన్ 25వ చిత్రం, త్రివిక్రమ్ కథ అలాగే పవన్ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రం మాత్రం ఆ అంచనాలని అందుకోలేకపోయింది అన్నది మాత్రం నిజం. డైలాగ్స్ అక్కడక్కడా పేలినప్పట్టికి, సినిమా మొత్తంగా మాత్రం ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.

ఇక మేఘా, నితిన్ ల జోడి బాగుంది అయితే రొటీన్ కథ అవ్వడంతో వారి మధ్య వచ్చిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. తమన్ సంగీతం మాత్రం ఈ సంగీతం ప్లస్ అని చెప్పొచ్చు. మొత్తానికి రంగస్థలం జోరు, రొటీన్ కథ అవ్వడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇది ఈ వారం www.iQlikmovies.com టాక్ అఫ్ ది వీక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS