వివాదాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారిన శ్రీ రెడ్డి నిన్న ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి అందరికి షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించి ‘మా’ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించింది.
ఆ వివరాల్లోకి వెళితే, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ- ఆమె తమ ఆఫీస్ కి వచ్చిన సందర్భంలో, ఆమెకి ‘మా’ అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని, అయితే ఆమెదానిని సరైన పద్దతిలో పూర్తీ చేయకపోవడం, మెంబర్ షిప్ కి కావాల్సిన మొత్తాన్ని కూడా DD రూపం లో చెల్లించలేదు అని చెప్పాడు.
అప్లికేషన్ ఇచ్చామంటేనే, ‘మా’లోకి ఆహ్వానించినట్టు అని అలాంటిది ఆమె ఆ అవకాశాన్ని సరైన పద్దతిలో ఉపయోగించుకోలేదు అని తెలిపారు. ఇదేసమయంలో నిన్న ఆమె చేసిన పనికి మాత్రం తీవ్రంగా పరిగణిస్తూ ఆమెకి ‘మా’ సభ్యత్వం ఇవ్వడం జరగదు అని తేల్చిచెప్పారు. అలాగే ఆమె తో ‘మా’ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా నటిస్తే, వారిని కూడా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
ఇక ఆమె చేసిన పనికి తమ లీగల్ సెల్ నుండి చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్టు కూడా తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేస్తే వారి పట్ల కూడా ఇలాంటి చర్యలు చేపడతాము అని ముగించారు.