హెబ్బా హౌస్‌లోకి రావడం లేదబ్బా.!

By iQlikMovies - July 18, 2018 - 10:05 AM IST

మరిన్ని వార్తలు

ఆ హాట్‌ బ్యూటీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా హాట్‌ బ్యూటీ అంటే.. 'కుమారి 21 ఎఫ్‌'తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. అయితే ఈ విషయమై హెబ్బా పటేల్‌ని అడగ్గా, నేను ఏ హౌస్‌లోకీ రావడం లేదు. నేను నా హౌస్‌లోనే ఉన్నాను అంటూ హెబ్బా పటేల్‌ పేర్కొంది. 

అంటే హెబ్బా ఎంట్రీ లేనట్లే అని కన్‌ఫామ్‌ చేసుకోవాలి. అయితే 'బిగ్‌బాస్‌' హౌస్‌లో హెబ్బా కోసం ఓ స్పెషల్‌ రూమ్‌ని ప్రిపేర్‌ చేస్తున్నారంటూ తాజాగా మరో ప్రచారం మొదలైంది. 'బిగ్‌బాస్‌' అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన ఓ నోట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు సోషల్‌ మీడియాలో ఆధారాలతో ప్రచారం జరుగుతోంది. అంటే హెబ్బా పటేల్‌ కోసం బిగ్‌ హౌస్‌లో ఏర్పాట్లు జరుగుతన్నట్లే అని తెలుస్తోంది. అసలింతకీ హెబ్బా పటేల్‌ ఎంట్రీ ఉన్నట్లా? లేనట్లా? 

ఇప్పటికే హౌస్‌ నుండి ఎలిమినేషన్‌ ద్వారా ఐదుగురు సభ్యులు బయటికి వచ్చేశారు. ఫస్ట్‌ వీక్‌ ఎలిమినేషన్‌ తర్వాత నందినిని ఎంటర్‌ చేశారు. కానీ ఆ తర్వాత హౌస్‌లోకి మరో ఎంట్రీ జరగలేదు. ఎలిమినేషన్‌ ద్వారా బయటికి వచ్చిన వాళ్లలోనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా శ్యామల వస్తే బావుండు, భానుశ్రీ వస్తే బావుండు అని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. 

ఏమో చూడాలి మరి బిగ్‌ హౌస్‌లోకి న్యూ ఎంట్రీ జరుగుతుందో, రీ ఎంట్రీ జరుగుతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS