పాపం: నితిన్ ఆశలన్నీ శ్రీనివాసుడి పైనే..!

మరిన్ని వార్తలు

'అ,ఆ..' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న నితిన్‌ కెరీర్‌ గాడిప పడిందనుకున్నారంతా. ఆ తర్వాత నితిన్‌కి తిరుగే లేదని భావించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సినిమా ఎంచుకోవాలన్న విషయంపైనే నితిన్‌ చాలా టైం తీసుకున్నాడు. 

ఎట్టకేలకు 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్‌తో రైజ్‌ చేసిన అంచనాలు సినిమాతో అందుకోలేకపోయాడు నితిన్‌. తర్వాత తన దేవుడు పవన్‌ కళ్యాణ్‌ బ్యానర్‌లో తనకు కెరీర్‌ బ్రేక్‌ ఇచ్చిన డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ స్టోరీతో కొత్త దర్శకుడు కృష్ణ చైతన్యతో 'ఛల్‌ మోహనరంగ' సినిమాలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైంది కానీ, ఈ చిత్రం కూడా నితిన్‌ని విజయం దిశగా తీసుకెళ్లలేకపోయింది. 

దాంతో అర్జెంటుగా ఇప్పుడు నితిన్‌కి ఓ సక్సెస్‌ కావాలి. అది ప్రస్తుతం నితిన్‌ నటిస్తున్న 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం ద్వారా వస్తుందని ఆశిస్తున్నాడు. 'శతమానం భవతి' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన సతీష్‌ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమాపై ఆశక్తిని పెంచాయి. ఎలాగైనా ఈ సినిమాతో హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు నితిన్‌. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చిందట. ఈ సినిమాతోనైనా నితిన్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడేమో చూడాలిక. 

మరోవైపు విభిన్న కథా చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటితో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు నితిన్‌. ఇదో ప్రయోగాత్మక చిత్రమనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS