షూటింగ్ లో గాయపడ్డ నితిన్

మరిన్ని వార్తలు

నితిన్ ని వరస పరాజయాలు వెంటాడుతున్నాయి. రీసెంట్ గా  ఎక్స్ట్రార్డనరీ మ్యాన్ మూవీతో  ఆడియన్స్ ముందుకు వచ్చారు.  కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నెక్స్ట్ తన ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉన్నాడు నితిన్. ప్రజంట్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'తమ్ముడు' మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రజంట్  మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా నితిన్ గాయపడ్డాడు. దీనితో మూవీ టీమ్ షూటింగ్ క్యాన్సిల్ చేశారు.


ఈ ప్రమాదంలో నితిన్ చేతికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే నితిన్ ని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్లగా మూడు వారాలు పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ పడిందని సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు కంగారుపడుతున్నారు. నితిన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


అక్క తమ్ముడు కి సంబంధించిన కథ కావటంతో ఈ మూవీకి తమ్ముడు అనే టైటిల్ ని ఖాయం చేసినట్టు తెలుస్తోంది. వరుస ఫ్లాప్ లతో ఉన్న నితిన్ కెరియర్ పవన్  'తమ్ముడు ' టైటిల్  సెంటిమెంట్ ఆదుకుంటుందా? లేదో చూడాలి. ఈ మూవీ దిల్ రాజ్ బానర్లో వస్తుండటంతో భారీ అంచనాలేర్పడ్డాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS