టాలీవుడ్ కథానాయకుడు నితిన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈనెల 26న షాలినిని వివాహం చేసుకోబోతున్నాడు. కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖుల్ని నితిన్ స్వయంగా ఆహ్వానిస్తున్నాడు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఈరోజు వ్యక్తిగతంగా కలిసిన నితిన్.... తన పెళ్లికి రమ్మంటూ ఆహ్వానించాడు. ఏప్రిల్ లోనే నితిన్ పెళ్లి జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.
నితిన్ త్వరలోనే పవన్ కల్యాణ్‌ని కలుసుకునే అవకాశం ఉంది. నితిన్ పవన్‌కి వీరాభిమాని. నితిన్ అంటే పవన్‌కీ ఇష్టం. నితిన్ పెళ్లికి పవన్ రాకపోతే ఎలా? ఈరోజో..రేపో.. పవన్ ఇంటికి నితిన్ వెళ్లడం ఖాయం. నితిన్ చాలామంది సెలబ్రెటీలను ఆహ్వానించినా, వాళ్లెవరూ పెళ్లికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే... ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్నాయి. పెళ్లికి 30 - 40 మంది అతిథులు ఉండడానికి వీల్లేదు. అందుకే నితిన్ పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరిగే అవకాశం వుంది.