యువ దర్శకుడు వేణు ఉడుగుల ప్రస్తుతం 'విరాట పర్వం' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో టబు, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1990 ల నేపథ్యంలో జరిగే కథతో ఈ సినిమా రూపొందించడం, మానవ హక్కులు -నక్సలిజం లాంటి సున్నితమైన అంశాలు టచ్ చేస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాకు వేణు ఉడుగుల సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. ఈమధ్య మూడు నెలలుగా షూటింగుకు అంతరాయం కలగడంతో వేణు ఉడుగుల తన నెక్స్ట్ సినిమాకు కథ తయారు చేసుకున్నారట. ఈ కథ ఏ జోనర్ కు సంబంధించినదో తెలియదు కానీ ఇది కూడా పీరియడ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట.
ఈ సినిమాలో కూడా సాయి పల్లవినే మెయిన్ లీడ్ గా అనుకుంటున్నాడట. ఇప్పటికే కథను వినిపించి తనను మెప్పించాడట. అంతా అనుకున్నట్టు జరిగితే వేణు ఉడుగుల నెక్స్ట్ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా ఉండే అవకాశం ఉంది.