ఫ్లాప్ డైరెక్ట‌ర్‌కి ఛాన్స్ ఇచ్చిన నితిన్‌

By Gowthami - February 23, 2021 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

నితిన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడిప్పుడు. `చెక్‌` ఈ వార‌మే విడుద‌ల అవుతోంది. `రంగ్ దే` కూడా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. `అంధాధూన్‌` రీమేక్ కూడా పూర్తి కావొస్తోంది. 2021లో నితిన్ నుంచి మూడు సినిమాలొస్తాయ‌న్న‌మాట‌. `అంధాధూన్‌` త‌ర‌వాత నితిన్ చేయ‌బోయే సినిమా ఖ‌రారైపోయింది. కృష్ణ చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. గీత ర‌చ‌యిత‌గా త‌న ప్ర‌యాణం మొద‌లెట్టారు కృష్ణ చైత‌న్య‌. నారా రోహిత్ తో `రౌడీ ఫెలో` తెర‌కెక్కించాడు.

 

ఆ త‌ర‌వాత‌.. నితిన్ తో `ఛ‌ల్ మోహ‌న‌రంగ‌` తీశాడు. `ఛ‌ల్ మోహ‌న‌రంగ‌` ఫ్లాప‌య్యింది. ఆ త‌ర‌వాత‌.. కృష్ణ చైత‌న్య పూర్తిగా పాట‌ల‌పైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు నితిన్ త‌న‌కు మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. దీనికి `ప‌వ‌ర్ పేట‌` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ద‌ర్శ‌కుడిగా కృష్ణ చైత‌న్య‌ని ఎంచుకున్నారు. మే నుంచి ఈ సినిమా ప‌ట్టాలెక్కొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS