నితిన్‌కి టైమ్ కలసి రావడం లేదు. 'అ.ఆ'తరవాత అన్నీ ఫ్లాపులే. వరుసగా మూడు ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టాడు. 'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాస కల్యాణం' ఒకదాన్ని మించి మరో ఫ్లాపు. ఈ ప్రభావం నితిన్ రెమ్యునరేషన్‌పై పడిందని టాక్.
'అ.ఆ' హిట్టు తరవాత నితిన్ పారితోషికం రూ.6 కోట్ల వరకూ వెళ్లిందట. 'లై'కి సరిగ్గా ఆరు కోట్లు తీసుకున్న నితిన్... ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో `ఛల్ మోహన రంగ` కోసం రూ.5 కోట్లు తగ్గాడు. 'శ్రీనివాస కల్యాణం'కి కూడా రూ.5 కోట్లు తీసుకున్నాడట.
ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు చేస్తున్న 'భీష్మ'కి రూ.3 కోట్టే ఇస్తున్నార్ట. అంటే ఆరు కోట్ల నుంచి 3 కోట్లకు పడిపోయాడన్నమాట. అయితే నితిన్ పారితోషికం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తనకో మంచి హిట్టు దక్కడమే పది కోట్లతో సమానం అనుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం చేస్తున్న `భీష్మ` చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఛలోతో ఆకట్టుకున్న వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు.