టైటిల్ చూసి హీరో నితిన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాడు అని అనుకోకండి. మనవాడు వెళ్ళింది ఢిల్లీ ప్రెసిడెంట్ బిల్డింగ్ కి కాకుండా అమెరికాలో ఉన్న ట్రంప్ బిల్డింగ్ కి నితిన్ వెళ్ళాడు.
వివరాల్లోకి వెళితే, హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న LIE చిత్రానికి సంబంధించి షూటింగ్ అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సొంత భవనం అయిన ట్రంప్ టవర్స్ లో షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి నిర్మాత అనిల్ సుంకర ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాడు.
అయితే ఇప్పటివరకు, ఈ లొకేషన్ లో ఏ తెలుగు సినిమా షూటింగ్ జరగలేదని, అమెరికాలో ఈ చిత్ర నిర్మాతలకి ఉన్న పలుకుబడి వల్లే ఇది సాధ్యమైంది అని ఫిలిం నగర్ వర్గాల టాక్.
సో.. హీరో నితిన్ ట్రంప్ టవర్స్ లో రిలాక్స్ అవుతున్నాడన్నమాట.