యంగ్ హీరోస్ నితిన్, శర్వానంద్ తమ డైరెక్టర్స్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. 'శతమానం భవతి' వంటి హిట్ సినిమాని శర్వానంద్‌కి అందించాడు సతీష్ వేగేశ్న. ఈ సతీష్ వేగేశ్న ఇప్పుడు నితిన్‌తో సినిమా చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమాకి 'శ్రీనివాస కళ్యాణం' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
రాఖీ ఖన్నా, నితిన్ వెడ్డింగ్ స్టైల్లో ఉన్న ఈ సినిమా మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. డిఫరెంట్‌గా ఆకర్షిస్తోందీ మోషన్ పోస్టర్. అన్నట్లు 'శతమానం భవతి' సినిమాను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ 'శ్రీనివాస కళ్యాణం' సినిమా కూడా రూపొందుతోంది. ఈ సినిమాకి ఎటు వైపు నుండి చూసినా అన్నీ సక్సెస్ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి. ఈ కారణాలతోనే 'లై'తో నిరాశ పరిచిన నితిన్‌కి ఈ సినిమాతో పక్కా హిట్ దక్కే అవకాశాలున్నాయనీ అంచనాలు వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, శర్వా విషయానికి వస్తే, నితిన్‌తో 'లై' సినిమాని తెరకెక్కించిన హను రాఘవపూడితో ఇప్పుడు శర్వానంద్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'పడి పడి లేచె మనసు' టైటిల్‌ని ఫిక్స్ చేశారు. కాన్సెప్ట్ ఏదైనా హను రాఘవపూడి సినిమాల్లో ఏదో తెలియని కొత్తదనం ఉంటుంది. 'లై'లోనూ ఆ కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు కానీ, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. దాంతో నిరాశ పరిచాడు. కానీ ఈ సారి అలా కాదు. పక్కా ప్లానింగ్‌తో వస్తున్నాడు. హిట్ పక్కాగా ఇస్తానంటున్నాడు. అందులోనూ ఇక్కడ ఉన్నది ఎవరు.!
శర్వా.. ఫెస్టివల్ హీరో. మరి హీరోయిన్, సాయి పల్లవి అసలే హైబ్రీడ్ పిల్ల. అందరికీ నచ్చేస్తుంది. సో హిట్ పక్కా అంటే పక్కానే మరి. ఇలా ఈ ఇద్దరు హీరోలు ఒకరికి హిట్ ఇచ్చేందుకు, ఒకరి నుండి హిట్ పొందేందుకు పరుగులు పెడుతున్నారు. నితిన్‌కి సతీష్ వేగేశ్న హిట్ ఇవ్వాలి. శర్వానంద్ నుండి హను హిట్ అందుకోవాలి. వారెవ్వా! ప్లాన్ అదిరిందిగా!