నితిన్‌కి హీరోయిన్ దొరికేసింది

By Gowthami - May 04, 2020 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

నితిన్ మ‌హా జోరుగా ఉన్నాడు. `భీష్మ‌` సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో త‌న‌లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. అన్నీ బాగుంటే ఈ పాటికి `రంగ్ దే` కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసేది. లాక్ డౌన్ వ‌ల్ల త‌న షెడ్యూల్ మొత్తం మారిపోయింది. నితిన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో `ప‌వ‌ర్ పేట‌` రీమేక్ ఒక‌టి. కృష్ణ చైత‌న్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో క‌థానాయిక‌గా కీర్తి సురేష్ ని ఎంచుకున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. నితిన్ తాజా చిత్రం `రంగ్ దే`లోనూ కీర్తినే క‌థానాయిక‌. ఆ సినిమా ఇంకా విడుద‌ల కాలేదు.

 

ఈలోగా కీర్తికి మ‌రో ఛాన్స్ ఇచ్చేశాడు నితిన్‌. `రంగ్ దే`లో నితిన్ - కీర్తిల కెమిస్ట్రీ బాగా కుదిరింద‌ట‌. అందుకే... ఈ సినిమాలో కీర్తి అయితే బాగుంటుంద‌ని నితిన్ డిసైడ్ అయ్యాడు. `అంధాదూన్‌` అనే హిందీ చిత్రాన్నీ నితిన్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన క‌థానాయిక అన్వేష‌ణ కూడా జ‌రుగుతోంది. మ‌రి అందులో ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS