యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ప్రోమోస్ చూస్తుంటే, క్యూట్ అండ్ లవ్‌లీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. కానీ, ఈ సినిమాలో డైరెక్టర్ ఎంచుకున్న నేపథ్యం ఆర్గానిక్ వ్యవసాయం అనే ఓ సీరియస్ సబ్జెక్టు. సినిమాలో హీరో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తుంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నేపథ్యం సొసైటీకి చాలా యూజ్ అయ్యే విషయమే. కానీ, నితిన్ తన గత చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’లో పెళ్లి, దాని ప్రాధాన్యత, మన సాంప్రదాయాలు తదితర అంశాలపై క్లాసుల మీద క్లాసులు పీకి బోర్ కొట్టించేశాడు. ఐతే ఈ సినిమాలో అలా క్లాసులు పీకే సందర్భాలేమీ ఉండవంటున్నాడు. తన జర్నీలో ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఓ భాగం మాత్రమే అని నితిన్ చెబుతున్నాడు. స్టార్టింగ్ నుండీ ఎండింగ్ వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంటాడట.
ప్రతీ క్యారెక్టర్ మనసుకు హత్తుకునేలా ఉంటుదని నితిన్ చెబుతున్నాడు. ముఖ్యంగా సాంగ్స్‌తో నితిన్ ఆడియన్స్‌ని బుట్టలో వేసేసుకున్నాడు. సాంగ్స్‌లో కనిపించే విజువల్స్ చాలా బాగున్నాయన్న రెస్పాన్స్ వస్తోంది. సో నితిన్ ‘భీష్మ’ ఓ విజువల్ ట్రీట్ కానుందని అర్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది. మహతి సాగర్ మ్యూజిక్ అందించారు. ‘ఛలో’ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వం అందించిన ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.