కమర్షియల్ హీరోయిన్గా ఓ రేంజ్‌కొచ్చాక, హీరోయిన్లు ప్రయోగాల బాట పట్టాలి.. అనేది ఎప్పటి నుండో కొనసాగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఈ సూత్రమే వర్కవుట్ అవుతూ ఉంటుంది. అయితే, తొలి సినిమాకే క్రేజ్ దక్కించుకుని, సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఆ క్రేజ్‌ని అలా కంటిన్యూ చేస్తున్న కన్నడ కుట్టీ రష్మిక మాత్రం అప్పుడే ప్రయోగాల ఆలోచన చేస్తోందట. పర్ఫామెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలకే తాను ప్రిఫరెన్స్ ఇస్తానని చెబుతోంది. క్యాజువల్‌గా సాగిపోయే స్టోరీస్ కన్నా, క్షణం క్షణం ఉత్కంఠ రేపే కథల్లో నటించడం తనకిష్టమంటోంది. అయితే, అప్పుడే అలాంటి పాత్రలు ఎంచుకోవడం కెరీర్‌కి సబబు కాదనీ, కొందరు సీనియర్స్ చెబుతున్నారట. వారి సలహాను పాఠించడం మంచిదే అని గ్రహించిన రష్మిక, ప్రయోగాల విషయంలో పునరాలోచన చేస్తోందట.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం రష్మిక నటిస్తున్న ‘భీష్మ’పై పోజిటివ్ వైబ్స్ వున్నాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతోంది. నితిన్, రష్మిక జంట క్యూట్‌గా ఆకట్టుకుంటోంది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీకి అప్పుడే ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి. సో ఈ సినిమా రష్మిక కెరీర్‌కి బాగానే యూజ్ అవుతుందనిపిస్తోంది. ఇక ‘భీష్మ’లో రష్మిక చైత్ర పాత్రలో కనిపించనుంది. చాలా ఫన్నీగా ఈ క్యారెక్టర్ని డిజైన్ చేశాడట డైరెక్టర్ వెంకీ కుడుముల. తన పాత్రకు డబ్బింగ్ చెప్పే సమయంలో తాను చాలా చాలా ఎంజాయ్ చేశాననీ, అదే ఎంజాయ్మెంట్ సినిమా చూస్తున్నంతసేపూ ఆడియన్స్ కూడా ఫీలవుతారని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది రష్మిక. రష్మిక మాట నిలబెట్టుకుంటుందో లేదో, తెలియాంటే ఫిబ్రవరి 21 వరకూ ఆగాల్సిందే.