ముద్దంటే కాదు.. పెళ్లంటే చేదంటోన్న ఇస్మార్ట్‌ బోయ్‌!

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్‌ అంటే మన ఇస్మార్ట్‌ శంకర్‌ కాదులెండి. 'భీష్మ' అంటూ కొత్త చిత్రంతో మన నైజాం బుల్లోడు నితిన్‌ త్వరలో ఎంటర్‌టైన్‌ చేయడానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్‌ చాలా స్మార్ట్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ స్మార్ట్‌ గయ్‌కి పెళ్లంటే ఇష్టం లేదట. ఆకట్టుకునే అందం, మంచి కార్పొరేట్‌ ఉద్యోగం.. ఇలా బెస్ట్‌ క్వాలిఫికేషన్స్‌ చాలా ఉన్నాయి మనోడిలో. కానీ, పెళ్లంటేనే ఎందుకో ఇష్టం లేదట.

 

ఆ 'ఎందుకో' అనే విషయం తెలియాలంటే మాత్రం 'భీష్మ' సినిమా చూడాల్సిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే స్టార్ట్‌ అయిన ఈ సినిమా రాకెట్‌ స్పీడుతో షూటింగ్‌ పూర్తి చేసుకుంటోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. నితిన్‌ స్పీడు చూస్తుంటే, ఈ ఏడాది చివర్లోనే 'భీష్మ'తో ప్రేక్షకుల ముందుకొచ్చేలా ఉన్నాడు. ఇదిలా ఉంటే, మరోవైపు ఆయన ఇంకో రెండు సినిమాలనూ అనౌన్స్‌ చేసి పెట్టిన సంగతి తెలిసిందే.

 

'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరితో ఒకటి, విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటితో ఇంకో సినిమా లాంఛనంగా స్టార్ట్‌ చేసి ఉంచారు. 'భీష్మ' ఒక కొలిక్కి రాగానే ఈ రెండు సినిమాలనీ పట్టాలెక్కించే యోచనలో ఉన్నాడు స్మార్ట్‌ బోయ్‌ నితిన్‌. 'అ,ఆ' సినిమా తర్వాత నితిన్‌కి చెప్పుకోదగ్గ హిట్‌ లేదు. బాగా గ్యాప్‌ కూడా వచ్చేసింది. గ్యాప్‌ తీసుకుని చేసిన 'శ్రీనివాస కళ్యాణం' ఆకట్టుకోలేదు. సో అర్జెంట్‌గా నిఖార్సయిన హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు నితిన్‌. చూడాలి మరి ఈ మూడు సినిమాల్లో నితిన్‌ ఆశించదగ్గ హిట్‌ ఏ సినిమా ద్వారా దక్కుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS