'ఓ నిర్మాత నన్ను అవమానించాడు' అంటూ ఆ మధ్య ఓ బాంబు పేల్చాడు సందీప్ కిషన్. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్‌తో షాక్ ఇచ్చాడు. తన సినిమాని కొంతమంది అడ్డుకోవాలని చూశారని, అడుగడుగునా ఆటంకం కలిగించారని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. సందీప్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'నిను వీడని నీడను నేనే`. ఈనెల 12న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్లో సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. తన సినిమాని అడ్డుకోవాలని చూశారని, విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఈ సినిమా బయటకు వస్తుందా? రాదా? అని టెన్షన్ పడ్డానని, అవన్నీ దాటుకుని ఈ సినిమా విడుదల చేస్తున్నానని చెప్పుకొచ్చాడు సందీప్.
''12న విడుదల చేయాలని నువ్వే డిసైడ్ అయిపోతే ఎలా? నీ సినిమా ఎప్పుడు రావాలో చెప్పాల్సింది మేం'' అని కొంతమంది నిర్మాతలు బెదిరించార్ట. ''నా సినిమా ఇది. నా ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేసుకుంటా'' అని సందీప్ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చాడట. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు సందీప్. హిట్టు సినిమా తీశానని, నా కెరీర్లో బాగా డబ్బులొచ్చే సినిమా ఇదేనని ధీమాగా చెప్పుకొచ్చాడు.