ఇది 'లై' (అబద్ధం) కాదు. నిజంగానే నితిన్ చాలా గట్టిగా కొట్టాడు. టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. మాటల్లేవ్, మాట్లాడుకోడాల్లేవంటున్నారు సినీ ప్రముఖులు. ఇటీవల వచ్చిన ఎన్టీయార్ 'జై లవకుశ' టీజర్ కూడా మంచి సంచలనాలే సృష్టిస్తోంది. అయితే మరి ఎన్టీయార్ 'జై లవ కుశ'తో పోల్చడం ఎంతవరకు సబబు? అనే విషయం పక్కన పెడితే, దాన్ని మించిపోయి ఉందని ఒప్పుకోవాల్సిందే. ఎన్టీయార్ అందులో సోలో పెర్ఫామెన్స్ అదరగొట్టేశాడు. 'జై లవకుశ' సినిమాలో ఎన్టీయార్ డైలాగ్ చెప్పిన విధానం, చివర్లో నవ్విన నవ్వు టీజర్ చూసేసిన తర్వాత కొన్ని గంటల తర్వాతా, కొన్ని రోజుల తర్వాతా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే 'లై' టీజర్ వచ్చాక మాత్రం లెక్కలు మారిపోయాయి. 'లై' సినిమాలోని 'అశ్వద్ధామ హతః - కుంజరః' అన్న డైలాగ్ వెంటాడేస్తోంది. అది చెప్పిన విధానం మరీను. కురుక్షేత్ర యుద్ధంలో కోటి మంది సైనికులు సరిపోలేదట, కృష్ణుడు అబద్ధాన్ని ఆశ్రయించాడట అనే రిఫరెన్స్ ఇప్పుడందరి నోళ్ళలోనూ నానుతోంది. ఈ డైలాగ్ ట్రెండింగ్ అయ్యేలా ఉంది. టీజర్ చివర్లో ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్‌నీ వదలిపెట్టకుండా ఇచ్చిన నితిన్ స్టైల్ అయితే రెండు కళ్లూ చాలడం లేదు. బడ్జెట్ పరంగా కూడా ఎన్టీయార్ 'జై లవకుశ'తో, నితిన్ 'లై' పోటీ పడినట్లే ఉంది. మేకింగ్‌లోనూ ఎక్కడా రాజీ పడలేదు. ఏదేమైనా నితిన్ కెరీర్ బెస్ట్ టీజర్ వచ్చిందని 'లై' చూశాక ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.