బాల్యంలో ఏం చేసినా తీపి గుర్తే. చిన్న దెబ్బ తగిలినా - తరువాతి రోజుల్లో మధుర స్మృతే. ఇక దొంగతనాలంటారా..? చిననాటి జ్ఞాపకాల ఎకౌంట్లో తప్పని సరిగా ఉండాల్సిన కౌంటు. సెలబ్రెటీలు కూడా చిన్నప్పుడు ఏదో ఓ దొంగతనం చేసే ఉంటారు. శ్రుతిహాసన్నే చూడండి. తాను కూడా ఓ చిలిపి దొంగే.. చిన్నప్పుడు.
శ్రుతి చిన్నప్పుడు ఓ క్యాండీస్ పాకెట్ కొట్టేసిందట. కాకపోతే... అది నాన్న కమల్ హాసన్ కంట్లో పడింది. ''ఇంలాటి పనులు ఇంకెప్పుడూ చేయకూడదు'' అని నాన్న మందిలించార్ట. ఆ షాపు యజమానికి ఆ ప్యాకెట్ తిరిగి ఇచ్చేస్తూ... శ్రుతి క్షమాపణలు కూడా చెప్పిందట. ఇక మీదట ఎప్పుడూ దొంగతనం చేయకూడదని ఆరోజే ఫిక్సయ్యిందట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తోంది శ్రుతి. ఒకట్రెండు తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.