నితిన్ పెద్ద రిస్కే చేస్తున్నాడే..?

మరిన్ని వార్తలు

భీష్మ‌తో ఓ సూప‌ర్ హిట్టు అందుకున్నాడు నితిన్‌. ఇప్పుడు త‌న చేతిలో బోలెడ‌న్ని సినిమాలున్నాయి. వాటిలో రంగ్ దే ఒక‌టి. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌. భీష్మ హిట్టుతో ఈ సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా పెరిగిపోయాయి. పైగా కీర్తి క‌థానాయిక కావ‌డంతో కావ‌ల్సినంత గ్లామ‌ర్ తోడైంది. అయితే ఈ సినిమా విడుద‌ల విష‌యంలో నితిన్ రిస్కు చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే జులై 30న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అదే రోజున కేజీఎఫ్ 2 విడుద‌ల అవుతోంది. కేజీఎఫ్ సూప‌ర్ హిట్టుతో చాప్ట‌ర్ 2పై ఆశ‌లు, అంచ‌నాలూ పెరిగిపోయాయి.

 

పాన్ ఇండియా ఇమేజ్ తో ఈ చిత్రం రూపొందుతోంది. దానికి తోడు స్టార్లతో ఈ సినిమా నిండిపోయింది. కేజీఎఫ్ తెలుగులోనూ భారీ వ‌సూళ్లు అందుకుంది. చాప్ట‌ర్ 2 కూడా ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తారు. దానికి పోటీ గా త‌న సినిమాని రంగంలోకి దింపుతున్నాడు నితిన్‌. కేజీఎఫ్ 2 సుదీర్ఘంగా సాగుతున్న ప్రాజెక్టు. ఈ సినిమా అనుకున్న స‌మాయానికి వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. రిలీజ్ డేట్ మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆ ధైర్యంతోనే నితిన్ త‌న సినిమాని జులై 30న విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ని తెలుస్తోంది. ఒక‌వేళ కేజీఎఫ్ 2 అనుకున్న స‌మ‌యానికే వ‌స్తే.... నితిన్ సినిమా వాయిదా ప‌డుతుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS