‘చందమామ’తో ‘అల్లరి’ చేస్తాడట.!

మరిన్ని వార్తలు

సురేష్‌ ప్రొడక్షన్స్‌లో రూపొందిన కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్రానీ’ తెలుగులో ‘ఓ బేబీ’గా రీమేక్‌ అయిన సంగతి తెలిసిందే. సమంత లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. సమంత కెరీర్‌లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటు నందినీ రెడ్డికీ, అటు సురేష్‌ ప్రొడక్షన్స్‌కీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు మరో కొరియన్‌ రీమేక్‌పై సురేష్‌ ప్రొడక్షన్స్‌ దృష్టి పెట్టిందట. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించేందుకు ఈ సారి కాజల్‌ అగర్వాల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయట. దాదాపు ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయ్యిందనీ సమాచారం.

 

త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారట. అలాగే ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడనీ తెలుస్తోంది. ‘ఓ బేబీ’లో యంగ్‌ హీరో నాగశౌర్య ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాడు. ఆ తరహా పాత్రలోనే ఇప్పుడు నరేష్‌ కనిపించబోతున్నాడట. మరోవైపు అల్లరి నరేష్‌ హీరోగా ‘నాంది’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘శతమానం భవతి’ డైరెక్టర్‌ సతీష్‌ వేగేశ్న ఈ సినిమాని నిర్మిస్తుండగా, విజయ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS