విలక్షణ చిత్రాల దర్శకుడు మిస్కన్ తెరకెక్కించిన తాజా చిత్రం 'సైకో'. ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీ రావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలోని సన్నివేశాలు చాలా జుగుప్సాకరంగా ఉంటాయట. క్రైమ్ సన్నివేశాలు భయం గొలిపేలా ఉంటాయట. అందుకే చిన్న పిల్లలూ, గర్భిణులూ ఈ సినిమాకి దూరంగా ఉండాలని డైరెక్టర్ సూచిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్‌కి జనం బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఈ మధ్య వచ్చిన క్రైమ్ థ్రిల్లర్స్‌కి మంచి ఆదరణ దక్కిన సంగతి తెలిసిందే.
ఇక నిత్యామీనన్ ఒప్పుకున్నదంటే, సినిమాలో విషయం ఉన్నట్లే. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు విభిన్నంగా రూపొందింది ఈ చిత్రం. విశాల్ నటించిన 'డిటెక్టివ్' చిత్ర దర్శకుడే ఈ మిస్కన్. ఈయన రూపొందించే సినిమాలన్నీ కాస్త సీరియస్ మోడ్‌లోనే ఉంటాయి. కానీ, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రేక్షకున్ని ఆధ్యంతం ఉత్కంఠ గొలిపే సన్నివేశాలు, కుర్చీలకు అతుక్కునేలా చేస్తాయి. 'సైకో'లో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయట. ముఖ్యంగా నిత్యామీనన్ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందట. ఇంతవరకూ నటించని పాత్రలో నిత్య కనిపించబోతోందట. అయితే, 'సైకో'కి నిత్య భయపడుతుందా.? లేక సైకోనే భయపెడుతుందా.? అనే విషయం తెలియాలంటే 'సైకో' చూడాల్సిందే.