తమిళనాడు ప్రజలు అమ్మ అని ప్రేమగా పిలుచుకునే మహిళ, దివంగత మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించేందుకు కోలీవుడ్‌లో ఒకరు కాదు, ముగ్గురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిత్యామీనన్ ముఖ్య పాత్రలో ఓ బయోపిక్ సెట్స్ మీదుంది. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్‌కి సంబంధించి, ఇటీవలే జయలలిత పాత్రలో నిత్యామీనన్ ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు భారతీరాజా దర్శకత్వంలో ఇంకో బయోపిక్‌కి స్క్రిప్టు పనులు వేగంగా జరుగుతున్నాయి.
ముచ్చటగా మూడో బయోపిక్‌ని ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్‌లో జయలలిత పాత్ర కోసం విద్యాబాలన్‌ని ఎంచుకున్నారట. జయలలిత జీవిత చరిత్రలో అతి ముఖ్యమైన వ్యక్తి ఎమ్‌జీఆర్. ఆ పాత్ర కోసం అరవింద్‌స్వామిని తీసుకున్నారట. ఈ కలయికలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఫిబ్రవరి 24న అధికారిక ప్రకటన రానుందని కోలీవుడ్ వర్గాల సమాచారమ్.
ఆ రోజు జయలలిత జయంతి కావడంతో అదే మంచి ముహూర్తంగా భావించారట. అంతేకాదు, ఈ సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ముందుగానే ప్లాన్ చేశారు. 2020 ఫిబ్రవరి 24న ఈ బయోపిక్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందట.