Nithya Menon: హీరోతో నిత్యా మీనన్ పెళ్లి.. నిజమేనా ?

మరిన్ని వార్తలు

నిత్యామీనన్ పర్శనల్ లైఫ్ పై వార్తలు తక్కువే. గతంలో ఆమె పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చినప్పటికీ వాటిని కొట్టిపారేసింది. తాజాగా మరోసారి ఆమె పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.

 

నిత్యా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుదని ఓ వార్త వినిపిస్తుంది. అంతేకాదు మలయాళ చిత్ర పరిశ్రమలోని ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని.. అతన్నే పెళ్లాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది వీరి వివాహానికి ఆయా కుటుంబాల నుంచి ఆమోదం లభించిందని.. ఈ క్రమంలోనే పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తుంది.

 

ప్రస్తుతం ఆమె కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు. చేతిలో వున్న సినిమాలని పూర్తి చేసిన తర్వాత వివాహం చేసుకొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా వుండాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తవం వుందో తెలియాల్సివుంది. గతంలో పెళ్లి వార్తలు వచ్చాయి కానీ హీరోతో పెళ్లి అనే వార్త రావడం కొత్తే. మరి ఈ వార్తలపై నిత్య రియాక్షన్ ఏమిటో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS