నేచురల్ బ్యూటీ నివేదా పేతురాజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నా, ఈ బ్యూటీ ఇంకా స్టార్ హీరోయిన్ల రేసులో చాలా చాలా వెనుకబడే వుంది. అందుక్కారణం, సోలో హీరోయిన్‌గా సరైన హిట్ లేకపోవడమే. ఎక్కువగా ఈ బ్యూటీని సెకెండ్ హీరోయిన్ కోటాలోనే చూస్తున్నారు తప్ప, మెయిన్ హీరోయిన్ మెటీరియల్‌గా భావించడంలేదు. అందానికి అందం, నటనకు నటన.. అన్నీ వున్నా, నివేదా పేతురాజ్‌కి ‘లక్’ కలిసి రావడంలేదు. ఇదిలా వుంటే, సోలో హీరోయిన్‌గా తనకు సరైన ఛాన్స్ వస్తే, తన సత్తా ఏంటో చూపిస్తానంటోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం దేవ్ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించనున్న సినిమాలో సోలో హీరోయిన్‌గా ఎంపికైంది నివేదా పేతురాజ్.
మరోపక్క, ‘రెడ్’ సినిమాలో రామ్ పోతినేని సరసన హీరోయిన్‌గా నటిస్తున్నా, ఇందులోనూ ఈమె మరో హీరోయిన్ (మాలవిక శర్మ)తో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తోంది. కాగా, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ బిగ్ హీరో సరసన సోలో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ ఛాన్స్ కొట్టేసిందట. ఆ వివరాలు అతి త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, తమిళంలోనూ కొన్ని సినిమాలు చేస్తోంది నివేదా పేతురాజ్. గ్లామర్ విషయంలో తనకెలాంటి నియమాలూ పెద్దగా లేవని ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని తన పాత్రతో చెప్పకనే చెప్పేసింది ఈ బ్యూటీ.