సినిమా కోసం ఎంత గ్లామర్ చూపించాలి.? అసలు ఎలాంటి దర్శకులతో సినిమాలు చేయాలి.? అన్నదానిపై పూర్తి అవగాహన వున్న అతికొద్దిమంది అందాల భామల్లో నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలేమో. ఎందుకంటే, గ్లామర్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చని, చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానమిస్తుంటుందామె. పైగా, ఆమె మాటల్లో ఆ స్పష్టతలో నిజాయితీ కూడా కనిపిస్తుంటుంది.
సినిమా అంటే తనకు ప్యాషన్ అనీ, ఆ కారణంగానే నటనను కెరీర్‌గా ఎంచుకున్నాననీ ఈ బ్యూటీ చెబుతోంది. అందాల ప్రదర్శన అంటే అదేమీ బూతు కాదనీ, మోడ్రన్ అమ్మాయిలు ఈ రోజుల్లో ధరిస్తున్న దుస్తులతో పోల్చితే, సినిమాలో హీరోయిన్ల అందాల ప్రదర్శన అస్సలు ఎక్కువ కాదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది నివేదా పేతురాజ్. త్వరలో ‘రెడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యూటీ, గ్లామర్ విషయంలో తన లెక్కలు పక్కగా వున్నాయని క్లారిటీ ఇచ్చేసింది.
అంతే కాదు, టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలేగానీ, కొందరు దర్శకులతో (ఆమె నటించిన సినిమాల దర్శకులు) తన కంఫర్ట్ లెవల్స్ గురించి కూడా చాలా బోల్డ్‌గానే చెప్పేసింది. కిషోర్ తిరుమలతో సినిమా చేయాల్సి వస్తే, కథ గురించి కూడా ఆలోచించకుండానే ఓకే చెప్తానంటోంది ఈ బ్యూటీ. నటన, అందం.. అన్నిటికీ మంచి సినిమాపై సూపర్బ్ క్లారిటీ.. ఇవన్నీ వున్నాయి గనుకనే.. మంచి మంచి విజయాలూ అందుకుంటోంది ఈ బ్యూటీ.