మడి కట్టుకుని కూర్చుంటే అవకాశాలు రావని చాలా లేట్‌గా తెలుసుకుందట ముద్దుగుమ్మ నివేదా థామస్. 'జెంటిల్‌మెన్' సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిందీ మలయాళ ముద్దుగుమ్మ. అయితే సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ పోతోంది. దీనికి కారణం గ్లామరస్ పాత్రలకు తాను దూరం అనే ముద్ర వేయించుకోవడమే.
దాంతో రావాల్సిన అవకాశాలు ఆ నెపంతో దూరమైపోతున్నాయనీ ఇండస్ట్రీ కోడై కోస్తోంది. గ్లామర్ పాత్రలకి నో చెప్పడంతోనే అవకాశాలు చేజారిపోతున్నాయని గ్రహించిన అమ్మడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై గ్లామర్ డోస్ పెంచాలనుకుంటోందట. ఎన్టీఆర్ సరసన 'జై లవకుశ' సినిమాలో నటించిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మరో సినిమాకి సైన్ చేయలేదు. ఎందుకంటే ఆ తర్వాత గ్లామర్ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయట నివేథాకి. దాంతో సింపుల్‌గా నో చెప్పేస్తోందట.
'జెంటిల్‌మెన్' సినిమాలో కొంచెం మోడ్రన్ లుక్‌లో కనిపించింది. కానీ ఆ గ్లామర్ సరిపోదు. హీరోయిన్‌గా రేస్‌లో ముందుకు దూసుకెళ్లాలంటే టాలెంట్‌తో పాటు, గ్లామర్ కూడా తప్పనిసరి. అందుకే ఇకపై ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచాలని అనుకుంటోందట. ప్రస్తుతం ఈ బ్యూటీ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందనీ సమాచారమ్. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలో కనిపించబోతున్నాడనీ సమాచారమ్. 'అమర్ అక్బర్ ఆంటోనీ' అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి స్థానం ఉంది. సో ఒకే సినిమాలో ముగ్గురితో పోటీ పడాలంటే ఖచ్చితంగా కావాల్సినంత గ్లామర్ పండించాల్సిందే. అందుకే ఈ బ్యూటీ ఇలా టర్న్ అయ్యిందని అంటున్నారు. మరో పక్క ఎన్టీఆర్‌తోనూ ఈ బ్యూటీ మరో ఛాన్స్ కొట్టేసిందనీ టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి.