రవితేజ తో రొమాన్స్ చేస్తున్న నివేతా థామస్

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు చిత్రం ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నాడు. 

ఈ చిత్రంలో ఈయనకి జంటగా యంగ్ హీరోయిన్ నివేథా థామస్ ని తీసుకున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ మొదలుకానుందట. ఇదే సమయంలో నివేథా థామస్-రవితేజలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి, ఈ చిత్రానికి ‘నేల టికెట్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. 

నివేథా థామస్ కి కూడా ఈ చిత్రంలో తన పాత్ర బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి వెంటనే ఒకే చెప్పిందట. ఇక ఈ చిత్ర కథ కూడా రవితేజ ఇమేజ్ కి అలాగే ఆయన నుండి ప్రేక్షకులు ఏవైతే కోరుకుంటారో అవ్వన్నీ ఈ చిత్రంలో ఉండబోతున్నాయట. 

కెరీర్ లో బ్రేక్ తీసుకున్న తరువాత చేసిన రాజా ది గ్రేట్ చిత్రం హిట్ అవ్వడంతో మళ్ళీ ఆయన చేసిన చిత్రాల పైన అందరికి క్రేజ్ పెరిగింది.  చూద్దాం.. ప్రేక్షకులని ఈ ‘నేల టికెట్’ ఎలా ఆకట్టుకుంటుందో అని.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS